Andhra CM Refuses To Perform Hindu Tradition ఏపీ సీఎం వైఎస్ జగన్ పై బీజేపి మత విమర్శలు..

Andhra cm refuses to perform lighting ceremonial lamp during us event

AP CM YS Jagan, US, Jaganmohan Reddy, Ceremonial Lamp, Chief Minister, BJP, YSRCP, religious allegations, Andhra Pradesh, Politics

AP CM Jaganmohan Reddy who is a Christian by faith has been accused of being anti-Hindu by the BJP, after he purportedly refused to light the ceremonial lamp while inaugurating an event in the US.

ITEMVIDEOS: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై బీజేపి మత విమర్శలు..

Posted: 08/21/2019 02:51 PM IST
Andhra cm refuses to perform lighting ceremonial lamp during us event

అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అక్కడి ఓ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించేందుకు నిరాకరించారన్న వార్తల నేపథ్యంలో ఆయను నెట్ జనులు ట్రాల్ చేస్తున్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్వాహకులు కోరినా.. అందుకు జగన్ నిరాసక్తత వెలిబుచ్చారని ఇదేమిటని నెట్ జనలు ప్రశ్నిస్తున్నారు. ఇక అవకాశం లభించడమే ఆలస్యమన్నట్లు అటు బీజేపీ కూడా జగన్ పై సంచలన ఆరోపణలు చేసింది. అందుకు సంబంధించిన వీడియోను నెట్టింట్లో కూడా పోస్టు చేశారు బీజేపి నేతలు.

ఏపీ బీజేపీ ఇన్ చార్జీ సునీల్ దేవ్ ధర్.. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి మరీ విమర్శిస్తున్నారు, అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో గుడులు, ఫుణ్యక్షేత్రాలు తిరిగి.. హిందువులు మనోభావాలకు అనుగూణంగా నడుచుకుని.. అధికారంలోకి రాగానే విదేశాల్లోని హిందువుల మనోభావాలను దెబ్బతిసేలా వ్యవహరించారని విమర్శలు చేశారు. సునీల్ దేవ్ ధర్ తో పాటు ఇటీవలే టీడీపీ నుంచి బీజేపిలోకి ఫిరాయించిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తదితరులు జగన్ తీరును తప్పుపట్టారు.


"వైసీపీ అధ్యక్షుడు జగన్ గారు అమెరికాలో ఒక కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడానికి నిరాకరించడం ఖచ్చితంగా హిందువులను అవమానించడమే. ఎన్నికల సమయంలో హిందువుల ఓట్ల కోసమే ఆయన దేవాలయాల చుట్టూ తిరుగుతూ నటించారని అర్థం అవుతుంది" అని సీఎం రమేష్ ట్వీట్ చేశారు. ఇక సునీల్ దేవ్ ధర్ ‘‘జగన్ ఆ దీపాన్ని వెలిగించడానికి ఎందుకు ఇష్టపడలేదని? తాను ఇతర మతస్థుడు కాబట్టే ఇలా చేసారా? వేరే మతాల ఓట్లను కేవలం తన రాజకీయ లబ్ది కోసమే డ్రామాలు ఆడి వోట్లు వేయించుకున్నారా? రాహుల్ గాంధీలానే బాగా నటించారని సునీల్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP CM YS Jagan  US  Jaganmohan Reddy  Ceremonial Lamp  Chief Minister  Andhra Pradesh  Politics  

Other Articles