Delhi Police submits report in sunanda suicide case శశిథరూర్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

15 injury marks found on sunanda pushkar s body says delhi police

Sunanda Pushkar death case, Sunanda Pushkar, Sunanda Pushkar death, Sunanda Pushkar death hearing, shashi tharoor charges, charges against shashi tharoor, Suicide case, shashi tharoor, domestic voilence, pakistan journalist, meher tarar, Delhi Police, Crime

Prosecutors arguing in a case related to the death of Sunanda Pushkar, wife of Congress MP Shashi Tharoor, has said that while post-mortem of the body said cause of death was poisoning, there were injury marks on the body that were 12 hours to at least four days old.

సునంద ఆత్మహత్య కేసులో శశిథరూర్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

Posted: 08/21/2019 01:15 PM IST
15 injury marks found on sunanda pushkar s body says delhi police

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన సతీమణి సునంద పుష్కర్ ఢిల్లీలోని ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. 2014 జనవరిలో సునంద ఆత్మహత్యకు సంబంధించిన కేసుకు గల కారణాలను ఢిల్లీ పోలీసులు న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. సునంద తీవ్ర మానసిక వేదనతో సునంద ఆత్మహత్యకు పాల్పడినట్టు ఢిల్లీ పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం సునంద బాడీలో విషం ఉందని, శరీరంపై కాళ్లు, చేతులు, మణికట్టుతో సహా 15 చోట్ల గాయాలు ఉన్నాయని కోర్టుకు తెలియజేశారు.

భర్త శశిథరూర్ తోనూ సంబంధాలు సరిగ్గా లేకపోవడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి గురైందని పేర్కోన్నారు. దీనికి తోడు శశిధరూర్, పాకిస్థానీ మహిళా జర్నలిస్టు మెహర్ తరార్‌తో సన్నిహితంగా ఉండటం కూడా సునందను మానసిక వేదనకు గురిచేసిందని పోలీసులు నివేదికలో పేర్కోన్నారు. న్యాయమూర్తి అజయ్ కుమార్ కున్హార్ ముందు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ వాదనలు వినిపిస్తూ, పోలీసుల నివేదికను అందజేశారు. తెలిపారు. అంతేకాదు, సునందను థరూర్ వేధింపులకు గురిచేశారని... ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు ఆమె పాల్పడ్డారని వారు ఆరోపించారు.

సునంద స్నేహితురాలు, జర్నలిస్ట్ నళిని సింగ్ వాంగూల్మం సైతం ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు సునంద తనకు ఫోన్ చేసి చెప్పిన అంశాలను ఇందులో వివరించారు. కాగా, సునంద ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న శశిథరూర్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 498-ఏ, 306 కింద కేసులు నమోదై ఉన్నాయి. థరూర్ తరఫున సీనియర్ లాయర్ వికాస్ పహ్వా వాదనలు వినిపిస్తూ.. తన క్లయింట్ అలాంటి మెయిల్స్ పంపిన దాఖలాలు లేవని అన్నారు. అనంతరం కేసును ఆగస్టు 31కి న్యాయమూర్తి వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles