'Anyone who tries to break India is criminal' మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సాధ్వా ప్రజ్ఞాసింగ్

Anyone who tries to break india is criminal bjp mp pragya thakur

BJP, MP Pragya Thakur, Jawaharlal Nehru, Article 370, Shivraj Singh Chouhan, PM Modi, Amit Shah, Article 35-A, Digvijay Singh, national, politics

BJP MP Sadhvi Pragya called former prime minister Jawaharlal Nehru a ‘criminal’ for imposing Article 370 in Jammu and Kashmir and praised PM Narendra Modi and Union Home Minister Amit Shah for scrapping Article 370

మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సాధ్వా ప్రజ్ఞాసింగ్

Posted: 08/20/2019 11:03 AM IST
Anyone who tries to break india is criminal bjp mp pragya thakur

హిందూ ఉగ్రవాదిగా అభియోగాలను ఎదుర్కోని జైలు జీవితం గడుపుతూ బెయిలుపై బయటకు వచ్చిన సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.. తన వివాదాస్పద వ్యాఖ్యలకు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. ఏకంగా పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను ఓడించిన ఆమె.. ఇక తన నోటికి తాళం వేసుకునే అవసరమే లేదు. అందుకు కారణం కేంద్రంలో వున్నది తమ ప్రభుత్వమే. ఎన్నికల తరుణంలో తనను జైలు అధికారులు అత్యంత దారుణంగా హింసించారని నియోజకవర్గ ఓటర్ల సానుభూతిని పోందే ప్రయత్నం చేసిన సఫలమైన ఆమె.. వివాదాస్సద వ్యాఖ్యలను మాత్రం చెక్ పెట్టడం లేదు.

ఆర్టికల్ 370 రద్దుపై వ్యాఖ్యానిస్తూ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాలు నిజమైన దేశభక్తులని, వారి నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు దేశభక్తులు కాలేరంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే జమ్ము కశ్మీర్ అంశంపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చేసిన ఘాటు వ్యాఖ్యల్ని కూడా ప్రఙ్ఞాసింగ్ సమర్థించారు. దేశాన్ని ముక్కలు చేసిన వారు నేరస్థులేనంటూనెహ్రూను టార్గెట్ చేస్తూ  వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌తో యుద్ధం చేస్తున్న సమయంలో జవహర్‌లాల్ నెహ్రూ కాల్పుల విరమణ ప్రకటించి నేరం చేశారని చౌహాన్ అన్నారు. తాజాగా ఆ వ్యాఖ్యల్ని ఈ ఎంపీ ప్రజ్ఞాసింగ్ సమర్ధించారు.

సమాకాలిన రాజకీయ నేతల విషయంలోనే లేక సర్వసాధారణమైన విషయాలకు సంబంధించో అయితే సర్థుకుపోవచ్చు. కానీ దేశస్వాతంత్ర్య సమరయోధుల విషయంలోనూ అమె నోరుపారేకుని.. వారిని చులకన చేసేలా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నలు కూడా విపక్షాల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్గాలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అప్పటి పరిస్థితులను బేరిజు వేసుకోకుండా.. స్వాతంత్ర్యానంతరం 70 ఏళ్ల తరువాత  వ్యాఖ్యలు చేయడం సముచితం కాదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  MP Pragya Thakur  Jawaharlal Nehru  Article 370  Shivraj Singh Chouhan  National  Politics  

Other Articles