Varanasi bans alcohol and meat near temples ప్రధాని మోడీ ఇలాకాలో మద్యం, మాంసంపై నిషేధం..

Total ban on liquor non vegetarian food around varanasi temples

non-veg, liquor, liquor ban, non-veg ban, Kashi temples, PM Modi, Varanasi, Yogi Adityanath, Uttar Pradesh, Politics

The Varanasi Municipal Corporation (VMC) passed a proposal for a complete ban on alcohol and non-vegetarian food in a 250-metre periphery near temples and heritage sites in this ancient pilgrim town, a top official said.

యోగీ సర్కార్ సంచలన నిర్ణయం.. మద్యం, మాంసంపై నిషేధం..

Posted: 06/17/2019 06:33 PM IST
Total ban on liquor non vegetarian food around varanasi temples

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోడీ ఇలాకా ( పార్లమెంటు నియోజకవర్గం) పరిధిలోని వారణాసిలో గల ఆలయాల సమీపంలో మద్యం, మాంసం అమ్మకాలపై నిషేధం విధించింది. అమ్మటమే కాదు.. మద్యం, మాంసాహారాలు సేవించినా కూడా నేరంగానే పరిగణించేలా చట్టాల్లో మార్పులను చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. తమ అదేశాలను అతిక్రమించిన వారెవైరా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది యోగీ సర్కార్.

దీనిపై వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ ప్రతిపాదనలో విధివిధానాలను నిర్దేశించారు. వారణాసిలోని ఆలయాలతో పాటు చారిత్రక కట్టడాల పరిసరాల్లోనూ మందు, మాంసం అమ్మకాలపై బ్యాన్ విధించారు. కాశీ విశ్వేశ్వరుడి ఆలయం చుట్టు పక్కల 250 మీటర్ల పరిధిలో ఎవరు కూడా ఈ పనులు చేయటాన్ని ఇక నుంచి నేరంగా పరిగణిస్తారు. ఆలయాల పవిత్రతను కాపాడే దిశగా సీఎం యోగి ఆదిత్యనాథ్ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఆలయాల పరిసరాల్లో మందు, మాంసం అమ్మకాలపై నిషేధం విధించాలని ఏప్రిల్ లోనే ఆదేశాలు జారీ చేశారు.

వారణాసి, వృందావన్, అయోధ్య, చిత్రాకోట్, డియోబంద్, దేవా షరీఫ్ పుణ్యక్షేత్రాల దగ్గర మద్యం, మాంసం సేల్స్ ను బ్యాన్ చేయాలన్నారు. కాశీ విశ్వేశ్వరుడి ఆలయం దగ్గర కిలోమీటర్ పరిధిలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని ఎక్సైజ్ శాఖ అదికారులను ఆదేశించారు. మధురాలోని క్రిష్ణ జన్మభూమి, అలహాబాద్ లోని సంగం ప్రాంతంలోనూ బ్యాన్ విధించాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. ఆలయాల పరిసర ప్రాంతాలు.. చారిత్రక కట్టడాల పరిసరాల్లో 250 మీటర్ల పరిధిలో మద్యం, మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ ప్రతిపాదన సిద్ధం చేశారు.

దీనిపై మరోసారి చర్చలు జరుపుతామని, ఫైనల్ రిపోర్ట్ ని ప్రభుత్వానికి పంపిస్తామని వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మృదుల జైస్వాల్ తెలిపారు. త్వరలోనే హరిద్వార్, అయోధ్యలోనూ ఇలాంటి నిషేధం అమలు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రధాని మోడీ ఎంపీగా ఉన్నారు. ఆధ్యాత్మిక రాజధానిగా వారణాసికి గుర్తింపు ఉంది. ఇక్కడ 2వేల ఆలయాలు ఉన్నాయి. ప్రఖ్యాత కాశీ విశ్వనాథుడి ఆలయం ఉంది. గంగా నదిలో భక్తులు పెద్ద సంఖ్యలు పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు.

దీంతో ఆలయాల పవిత్రతను, భక్తుల మనోభావాలను పరిరక్షించే దిశగా యోగీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఆలయాలు, చారిత్రక కట్టడాల పరిసరాల్లో మద్యం, మాంసం అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించడం సంచలనంగా మారింది. కొన్ని సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది దారుణం అంటున్నాయి. ఇప్పుడు ఆలయాలకు 250 మీటర్ల దూరం వరకు నిషేధం విధించారని.. రేపు వారణాసి మొత్తం మందు, మాంసం అమ్మకాలపై నిషేధం విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదని మండిపడుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని సంఘాల నేతలు హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : non-veg  liquor  liquor ban  non-veg ban  Kashi temples  PM Modi  Varanasi  Yogi Adityanath  Uttar Pradesh  Politics  

Other Articles