Priyanka Gandhi on attack on Congress MLA Aditi Singh కాంగ్రెస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం.. బీజేపి ఎమ్మెల్యేపై కేసు

Bjp candidate kin booked for attack on up congress mla aditi singh

Aditi Singh, congress, Congress MLA, rae-bareli, uttar pradesh, ‪Rae Bareli‬‬, Avadesh Singh, Dinesh Pratap Singh, uttar pradesh politics

"Our leaders were beaten with lathis. There were goons who targeted Congress workers but no action was taken by police. This is an attack on democracy. We will not tolerate this," Priyanka Gandhi

కాంగ్రెస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం.. బీజేపి ఎమ్మెల్యేపై కేసు

Posted: 05/15/2019 06:15 PM IST
Bjp candidate kin booked for attack on up congress mla aditi singh

ఉత్తర్‌ప్రదేశ్‌ రాయ్‌బరేలీలోని హరచంద్ పూర్ లో కాంగ్రెస్‌ మహిళా ఎమ్మెల్యే అదితీ సింగ్ పై హత్యాయత్నం జరగడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తీవ్రంగా ఖండించారు. అదితీ సింగ్ సహా జిల్లా పరిషత్ సభ్యులకు గాయాలైన నేపథ్యంలో అమె ఇవాళ ఉత్తర్ ప్రదేశ్ లోని రాయబరేలీకి చేరుకున్నారు. సలీమ్ పూర్, వారణాసి లోక్ సభ నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్లాల్సిన అమె ఈ ఉదయం జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తిలక్ భవన్ కు చేరుకున్నారు. అక్కడ అమె ఎమ్మెల్యేతో పాటు జిల్లా పంచాయితీ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా అమె వారిలో ధైర్యాన్ని నింపారు. ‘‘ మీ వెంట మేము వుంటాము.. ఎంతవరకైనా అండగా నిలుస్తాం. ఈ హత్యాయత్నం కేసులో అవసరమయ్యే ప్రతీ చర్యలోనూ మేము అండగా వుంటాము. ఈ విషయంలో జిల్లా అధికారులు పాత్రపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు కూడా న్యాయసలహా తీసుకుంటాం. అవసరమైన నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు తలుపు కూడా తట్టుదాం’’ అని ప్రియాంకా గాంధీ జిల్లా పంచాయితీ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిని పంచాయతీ సభ్యుడు రాజేష్ అస్వతితో అమె ఫోన్ లో పరామర్శించారు. మీకు ఒంటరిగా లేరు. మీ వెనుక మేము వున్నామని ప్రియాంక అతనితో చెప్పారు.

రాయ్‌బరేలీ పంచాయతీ అధ్యక్షుడు, బీజేపి నేత అవదేశ్‌ సింగ్‌ పై విశ్వాసపరీక్ష నేపథ్యంలో తాము హాజరు అయ్యేందుకు వెళ్తున్న సమయంలో ‘రెండు కార్లలో వచ్చి తమను దుండగుటు అడ్డుకున్నారని అదితి సింగ్ తెలిపారు. దాదాపు 50 మంది దాడికి ప్రయత్నించారు. వారి చేతుల్లో రాడ్లు ఉన్నాయి.. మాపై రాళ్లు రువ్వారు. అవదేశ్‌ సింగ్‌ ఓ కారులో కూర్చొని ఉన్నాడు’ అని తెలిపారు. ఈ దాడి వెనుక రాయ్‌బరేలీ బీజేపి లోక్‌సభ అభ్యర్థి, అవదేశ్‌ సింగ్‌ సోదరుడు దినేశ్‌ సింగ్‌ ఉన్నారని అదితీ సింగ్‌ ఆరోపించారు.

ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్‌ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో రాయ్‌బరేలీ ఎమ్మెల్యేపై జరిగిన హత్యాయత్నం ద్వారా తెలుస్తోంది. ఆ దాడి ద్వారా భాజపా మరోసారి తమ నిజస్వరూపాన్ని బయట పెట్టింది’ అని పేర్కొంది. కాగా, ఇది కాంగ్రెస్ లోని రెండు వర్గాల పోరాటం కావచ్చునని.. దీనితో తమ ప్రభుత్వానికి కానీ, జిల్లా యంత్రాంగానికి కానీ ఎలాంటి సంబంధం లేదని బీజేపి ఉత్తర్ ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి దినేష్ శర్మ అన్నారు. ఈ ఘటనపై న్యాయవిచారణకు అదేశించామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RaeBareily  Priyanka Gandhi  LoKSabhaPolls  uttar pradesh  politics  

Other Articles