Will increase minimum days from 100 to 150 under MNREGA పనికి ఆహారపథకాన్ని 150 రోజులకు పెంచుతాం: ప్రియాంక

Never saw a more coward weak pm than modi says priyanka

NehruGandhi family, Indian Hindus, Priyanka Gandhi, National Rural Employment Guarantee Act, Mahatma Gandhi, Vadra, Indian National Congress, Chief Development Officer, Robert Vadra, Uttar Pradesh, Congress, Modi, politics

Priyanka Gandhi claimed that Prime Minister Narendra Modi had failed to answer people's questions on his "unfulfilled" promises about generating two crore jobs and doubling farmers' income.

దేశచరిత్రలో రైతుల సమస్యలు వినని ప్రధాని మోడీనే: ప్రియాంక

Posted: 05/10/2019 02:54 PM IST
Never saw a more coward weak pm than modi says priyanka

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విమర్శలు చేశారు. మోదీ వంటి భయస్థుడు, బలహీనమైన ప్రధానిని తాను ఎన్నడూ చూడలేదని అన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను మోదీ మరిచారని దుయ్యబట్టారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగార్చిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఈ పథకం కింద ప్రస్తుతం ఉన్న వంద రోజుల పనిదినాలను 150కు పెంచుతామని, న్యాయ్ పథకం తీసుకొచ్చి పేదలకు ప్రయోజనం చేకూరేలా చేస్తామని హామీ ఇచ్చారు.

పెద్ద పెద్ద మాటలు చెబుతూ.. మాటల్లోనే గొప్పతనాన్ని చాటేవారే నిజానికి ప్రజాహిత కార్యక్రమాలు మాత్రం చేయరంటూ.. పరోక్షంగా మోదీపై ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్థ నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ, మాటల్లోనే గోప్పతనం చాటే వారిది పనులు కేవలం కాయితాల వరకు మాత్రమే పరిమితం అవుతాయని, కానీ పనులు చేసే వ్యక్తులు తక్కువగా మాట్లాడుతారు.. తమ ప్రతీ మాట అక్షరరూపంలో సాక్ష్యాత్కరించాలని శ్రమిస్తారని అమె తన సోదరుడి గురించి చెప్పారు.

ప్రతి వ్యక్తి అకౌంట్ లో రూ.15 లక్షలు వేస్తామన్న హామీ ఏమైంది? ఐదేళ్ల క్రితం రైతులకు ఇచ్చిన హామీ ఏమైంది? రైతుల గోడు వినే తీరిక కూడా మోదీకి లేదా? నిజంగా రైతులు ఐదేళ్ల క్రితం వచ్చినా అధాయానైనా ఇప్పుడు పొందగలుగుతున్నారా.? అంటూ ప్రియాంక ప్రశ్నలు కురిపించారు. ఎన్నికల ముందే మోదీకి రైతులు గుర్తుకురావడం విడ్డూరంగా ఉందని అన్నారు. కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో మరో మోసానికి మోదీ తెరలేపారని దుయ్యబట్టారు.

దేశంలోని రైతులకు వెన్నుదన్నుగా నిలిచే భూపరిరక్షణ చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిందని.. దానికి సవరణలు చేసే ప్రయత్నం చేసిన మోడీ సర్కార్ ను రైతులే అడ్డుకున్న విషయం అమె గుర్తించారు. ఇలాంటి రైతు వ్యతిరేకైన నరేంద్ర మోడీ మనకు ప్రధానిగా కావాలా.? అంటూ అమె నిలదీశారు. దేశ ప్రజలకు చేసిన పనులు చెప్పమంటే మోడీ ప్రతీ ప్రసంగంలోనూ సైన్యం గొప్పదనాన్ని తనదిగా పేర్కోంటూ వాడుకుంటున్నారని అమె మండిపడ్డారు. మాటలు చెప్పేవారు ప్రజలకు నిజానికి ఏం చేశారో చెప్పమంటే మాట మట్లాడరని అమె దుయ్యబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Gandhi  Congress  PM Modi  Rahul Gandhi  Uttar Pradesh  Nation  politics  

Other Articles