Empty chairs at Yogi rally సొంత రాష్ట్రంలో సీఎంకు పరాభవం.. నటికి కష్టకాలం..

Rows of empty chairs at hema malini and yogi adityanath s mathura rally

Indian National Congress (Congress), Bharatiya Janata Party (BJP), Hema Malini, Lok Sabha Elections 2019, Yogi Adityanath, Mathura lok sabha seat, Empty chairs, No responce from people, national politics, Amit shah, PM Modi, politics

Only a few hundred people turned up to listen to Yogi Adityanath when he was in Mathura, to address an election rally in support of actress and sitting MP Hema Malini.

సొంత రాష్ట్రంలో ముఖ్యమంత్రికి పరాభవం.. నటికి కష్టకాలం..

Posted: 03/26/2019 04:14 PM IST
Rows of empty chairs at hema malini and yogi adityanath s mathura rally

రాష్ట్రంలో ముఖ్యమంత్రి సభ జరుగుతుందని అనగానే వేలాది మంది జనం రావడం పరిపాటి. దీంతో పాటు ఇక సినీనటి, పార్లమెంటు సభ్యురాలు వస్తుందంటే ఇక ఆ సభకు ప్రజలను డబ్బులిచ్చి తరలించాల్సిన అవసరం లేదు సరికదా.. ఇసుకేసినా రాలనంత జనం వస్తారు. అయితే ఐదేళ్ల క్రితం అలాగే వున్న పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 2016లో జరిగిన నోట్ల రద్దు తరువాత కూడా అక్కడి రాజకీయ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనబడలేదు. అయితే ఈ సారి మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.

నీరాజనాలు పట్టిన ప్రజలే ఇప్పుడు తమ ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగానే వెనుదిరుగుతున్నారు. దీంతో ఆయనకు పరాభవం ఎదురైంది. ఈ ప్రాంతవాసి కాకపోయినా.. గత ఎన్నికలలో వలసరాజకీయ వాదిని అదరించిన ఓటర్లు ఈ సారి మాత్రం అందుకు సుముఖంగా లేరు. దీంతో ఐదేళ్ల కిత్రం నల్లేరుపై నడకగా సాగిన నటి పార్లమెంటు ప్రయాణం.. ఈ సారి మాత్రం కష్టతరంగా మారనుంది. ఐదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా వినిపించిన మోడీ ప్రభంజనం.. ఈ సారి ఉత్తరభారతంలోనే కనిపించకపోవడం కోసమెరుపు. ఇక ఉత్తరభారతంతో పాటు దేశవ్యాప్తంగా అత్యధిక ఎంపీ స్థానాలు కలిగిన ఉత్తర్ ప్రదేశ్ లో ఈ పరిణామాలు ఉత్పన్నం కావడం గమనార్హం.

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ఇపుడిపుడే ఊపందుకుంటోంది. జనం మాత్రం ఎన్నికల సభల పట్ల పెద్ద ఆసక్తి ఉన్నట్లు లేదు. మధుర  లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఈసారి కూడా అలనాటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని పోటీ చేస్తున్నారు. మధురలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో హేమమాలినితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ కూడా పాల్గొన్నారు. జనం మాత్రం లేక సభ వెలవెల పోయింది. సభ ప్రారంభంలో ఈ పరిస్థితి ఉన్నా... తరవాత సీఎం వచ్చి సభలో మాట్లాడినా.. జనం ఎవరూ రాలేదు. పైగా ముఖ్యమంత్రి మాట్లాడుతుండగానే జనం వెళ్ళిపోవడాన్ని ఎన్‌డీటీవీ చూపించింది. ఈసారి ఎన్నికలు గత ఎన్నికలకు భిన్నంగా సాగుతున్నట్లు ప్రచార సరళి స్పష్టం చేస్తోంది. బీఎస్పీ, ఎస్పీ కలిసి పోటీ చేయడం బీజేపీ సభలో తీవ్ర ప్రభావం చూపిస్తోందని స్థానిక రాజకీయ నేతలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Hema Malini  Mathura  Yogi Adityanath  Empty chairs  Lok Sabha Elections 2019  national politics  

Other Articles