ఓటమి కొత్తకాదు.. పూర్వవైభవం రాక తప్పదు.. Mulayam Singh Blames Congress Tie-Up For UP Rout

No one responsible for up debacle says mulayam singh

Mulayam Singh, Samajwadi Party, UttarPradesh, elections-2017, UP Elections, Akhilesh Yadav, congress, shivpal yadav, politics

Samajwadi Party patriarch Mulayam Singh Yadav today said no one was responsible for the party's stunning defeat in Uttar Pradesh assembly elections

ఓటమి కొత్తకాదు.. పూర్వవైభవం రాక తప్పదు..

Posted: 03/12/2017 05:59 PM IST
No one responsible for up debacle says mulayam singh

ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ ఓటమికి ఏ ఒక్కరూ కారణం కాదంటూ ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ అన్నారు. హోలీ పండగ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ ఓటమిపై స్పందించారు. ఓటమి తమకు కొత్త కాదని, అయితే మళ్లి పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే విధంగా తాము చర్యలు తీసుకోవడంతో పాటు కార్యచరణను కూడా అమలు పరుస్తామని అన్నారు. అయితే ఓటమికి కారణం మాత్రం ఓటర్లను సంతృప్తి పరచలేకపోవడమేనని అభిప్రాయపడ్డారు, అందుకనే తమ పార్టీ ఓటమిని చవిచూడాల్సిన అవసరం వచ్చిందని అన్నారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టిన ఎస్పీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ కూటమి 54 సీట్లు మాత్రమే గెలిచింది. బీజేపీ అంచనాలకు మించి 325 సీట్లు కైవసం చేసుకుంది. ములాయం కొడుకు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం, ఎన్నికలకు ముందు ములాయం కుటుంబంలో చోటుచేసుకున్న విభేదాలు ఎస్పీ ఓటమి కారణాలుగా భావిస్తున్నారు. ములాయం ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. కేవలం సోదరుడు శివపాల్ యాదవ్, కోడలు అపర్ణ పోటీచేసిన జశ్వంత్ నగర్, లక్నో కంటోన్మెంట్‌లలో మాత్రమే ప్రచారం చేశారు. శివపాల్ విజయం సాధించగా, అపర్ణ ఓటమి చవిచూశారు. కాగా తమకు ఓటమి కొత్త కాదని, పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామని ములాయం అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles